జగన్ కు క్యారెక్టర్ లేదంటున్నావు? నీకుందా?: చంద్రబాబుకు మోహన్ బాబు సూటి ప్రశ్న

  • జగన్ పైనే కాదు చంద్రబాబుపైనా కేసులు ఉన్నాయి
  • దొరకని వాడు దొర..నువ్వు దొరకలేదు 
  • చంద్రబాబు కావాలని ప్రజలు కోరుకోలేదు
జగన్ కు క్యారెక్టర్ లేదంటున్న చంద్రబాబుకు ఉందా? అని వైసీపీ నేత, ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు సూటిగా ప్రశ్నించారు. విజయవాడలోని వైసీపీ కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జగన్ పైనే కాదు చంద్రబాబుపైనా కేసులు ఉన్నాయని అన్నారు.

చంద్రబాబు చుట్టూ ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేల్లో కొంతమంది అవినీతిపరులు ఉన్నారని, ‘దొరికే వాడు దొంగ, దొరకని వాడు దొర..నువ్వు దొరకలేదు’ అంటూ బాబుపై మండిపడ్డారు. చంద్రబాబు కావాలని ప్రజలు కోరుకోలేదని, ఎన్టీఆర్ పై ప్రేమతో, ఆయన స్థాపించిన పార్టీపై ప్రేమతోనే బాబును ఎన్నకున్నారని అభిప్రాయపడ్డారు. నాడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీని స్థాపించారని, నేడు ఆ పార్టీతోనే టీడీపీ కలిసిందని, ఈ పని చేసిన చంద్రబాబుకు సిగ్గుందా? అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Go Back to Shorts
YSRCP
jagan
mohanbabu
Telugudesam
Chandrababu

More Telugu News